Big on Hosting. Unlimited Space & Unlimited Bandwidth

Friday, 8 December 2017

టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే.....

Only "Prabhas" from Tollowood Industry



ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది. బాహుబలి విజయం ప్రభాస్ కు ఎంత పేరు తీసుకొచ్చిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 2017సంవత్సరానికి గాను టాప్-10 స్టార్స్ లో ప్రభాస్ కూడా ఒకటిగా నిలిచాడు. సల్మాన్, షారూక్, అమీర్ లాంటి హేమాహేమీల సరసన ప్రభాస్ కు చోటుదక్కింది.
ఇదేదో సర్వే ఫలితమో.. ఐవీఆర్ కార్యక్రమమో కాదు. సాంకేతికంగా నిరూపితమైన నిజం. సోషల్ మీడియాలో అత్యథిక పేజ్ వ్యూస్ కలిగిన హీరోల జాబితా తయారుచేసింది ప్రముఖ ఆన్-లైన్ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ. ఒక నెలలో 250 మిలియన్ పేజ్ వ్యూస్ ఉన్న ఇండియన్ స్టార్స్ ను మాత్రమే తీసుకొని టాప్-10 లిస్ట్ తయారుచేసింది. ఈ లిస్ట్ లో ఆరో స్థానంలో నిలిచాడు ప్రభాస్. 
ప్రభాస్ కు ఇంత భారీగా పేజ్ వ్యూస్ రావడానికి కారణం బాహుబలి-2 సినిమా. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే స్లోగన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఆటోమేటిగ్గా అందర్నీ ఎట్రాక్ట్ చేయగలిగాడు. ఇలా లిస్ట్ లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. లిస్ట్ లో తమన్నకు 4వ స్థానం, అనుష్కకు 8వ స్థానం దక్కాయి.
ఇక టాప్-10 లిస్ట్ లో మొదటి స్థానంలో షారూక్ ఖాన్, రెండో స్థానంలో అమీర్ ఖాన్ నిలిచారు. సల్మాన్, కత్రిన, ఇర్ఫాన్ ఖాన్ కు కూడా జాబితాలో చోటుదక్కింది. సౌత్ నుంచి లిస్ట్ లో నిలిచిన హీరో మాత్రం ప్రభాస్ ఒక్కడే.

No comments:

Post a Comment